మీరు డెవలపరా?
మీ Chrome యాప్‌లను పబ్లిష్ చేయండి2024 జనవరి 27న మా సర్వీస్ నియమాలను అప్డేట్ చేశాము. మరిన్ని వివరాల కోసం, కీలక మార్పుల సారాంశాన్ని దిగువున అందించాము.
1.1 Google Chrome వెబ్ స్టోర్ (“వెబ్ స్టోర్”)ను ఉపయోగించడం ద్వారా, మీరు https://policies.google.com/terms లింక్‌లోని Google సర్వీస్ నియమాలు, https://policies.google.com/privacy లింక్‌లోని Google గోప్యతా పాలసీ, అలాగే ఈ వెబ్ స్టోర్ సర్వీస్ నియమాల (అన్ని కలిపి "నియమాలు" అంటారు) ద్వారా కట్టుబడి ఉంటామని అంగీకరించి ఆమోదిస్తున్నారు.
1.2 మీరు Google Chromeకు సంబంధించిన వినియోగం కోసం ప్రోడక్ట్లను (Google Chromeకు సంబంధించిన వినియోగం కోసం క్రియేట్ చేసిన, అలాగే వెబ్ స్టోర్ ద్వారా పంపిణీ చేయబడిన సాఫ్ట్వేర్, కంటెంట్, డిజిటల్ మెటీరియల్‌లుగా నిర్వచించబడినవి) బ్రౌజ్ చేయడానికి, కనుగొనడానికి, అలాగే డౌన్లోడ్ చేయడానికి వెబ్ స్టోర్‌ను ఉపయోగించవచ్చు. ఈ ప్రోడక్ట్లలో కొన్ని Google ద్వారా అందించబడి ఉండవచ్చు, మరికొన్ని Googleతో అనుబంధం లేని థర్డ్-పార్టీల ద్వారా అందుబాటులో ఉంచబడవచ్చు. వెబ్ స్టోర్‌లో Google ద్వారా కాకుండా వేరే సోర్స్ నుండి అందించబడిన ఏ ప్రోడక్ట్ విషయంలో అయినా Google బాధ్యత వహించదని మీరు అంగీకరిస్తున్నారు.
1.3 (1) మీకు ఈ ఆప్షన్లు అందించిన చోట అంగీకరిస్తున్నట్లు లేదా ఆమోదిస్తున్నట్లు క్లిక్ చేయడం ద్వారా లేదా (2) వెబ్ స్టోర్ యాప్ లేదా వెబ్ సర్వీస్‌ను ఉపయోగించడం ద్వారా మీరు నియమాలను అంగీకరిస్తున్నారు.
1.4 వెబ్ స్టోర్‌ను ఉపయోగించడానికి, మీకు తప్పనిసరిగా 13 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. మీ వయస్సు 13, 18 ఏళ్ల మధ్య ఉంటే, మీరు వెబ్ స్టోర్‌ను ఉపయోగించడానికి తప్పనిసరిగా మీ తల్లిదండ్రుల లేదా చట్టపరమైన గార్డియన్ అనుమతి పొందాలి.
2.1 Google తన విచక్షణను అనుసరించి సాధారణంగా ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండానే మీకు లేదా యూజర్లకు వెబ్ స్టోర్ (లేదా వెబ్ స్టోర్‌లోని ఏవైనా ఫీచర్లు)ను అందించడం ఆపివేయవచ్చని (శాశ్వతంగా లేదా తాత్కాలికంగా) మీరు అంగీకరిస్తున్నారు.
2.2 Google మీ ఖాతాకు యాక్సెస్‌ను నిలిపివేస్తే, మీరు వెబ్ స్టోర్, మీ ఖాతా వివరాలు లేదా మీ ఖాతాతో స్టోర్ చేసిన ఏవైనా ఫైల్లు లేదా ఇతర ప్రోడక్ట్లను యాక్సెస్ చేయకుండా నిరోధించబడవచ్చని మీరు అంగీకరిస్తున్నారు.
2.3 వెబ్ స్టోర్ యాప్ యూజర్ ఇంటర్ఫేస్లో వెబ్ స్టోర్ వినియోగం, నిర్వహణకు (ప్రోడక్ట్లను ఎలా కనుగొనాలి, డౌన్లోడ్ చేయాలి, తీసివేయాలి అనే అంశాలతో సహా) సపోర్ట్ Google ద్వారా అందించబడుతుంది. వెబ్ స్టోర్‌లో డెవలపర్ల ద్వారా డిస్ట్రిబ్యూట్ అయిన ప్రోడక్ట్‌లకు Google, కస్టమర్ సపోర్ట్ విభాగాన్ని అందించదు. ప్రతి డెవలపర్, వారు అందించే కస్టమర్ సపోర్ట్ విభాగం స్థాయిని నిర్ణయించడానికి వారే బాధ్యత వహిస్తారు, మీరు సపోర్ట్ కోసం నేరుగా వారినే సంప్రదించాలి.
3.1 వెబ్ స్టోర్‌లో నిర్దిష్ట సర్వీస్‌లను యాక్సెస్ చేయడానికి, మీరు మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, Google ఖాతా సమాచారం, అడ్రస్, అలాగే బిల్లింగ్ వివరాలు వంటి మీకు సంబంధించిన సమాచారాన్ని అందించవలసిన అవసరం ఉండవచ్చు. మీరు Googleకు అందించే అటువంటి సమాచారం ఏదైనా ఎల్లప్పుడూ ఖచ్చితంగా, సరిగ్గా, అప్డేట్ అయ్యి ఉంటుందని అంగీకరిస్తున్నారు.
3.2 మీరు (ఎ) నియమాలు, (బి) సంబంధిత అధికారిక ప్రదేశాల్లో వర్తించే ఏదైనా చట్టం, నియంత్రణ లేదా సాధారణ ఆమోదిత ఆచరణలు లేదా గైడ్‌లైన్స్ ప్రకారం అనుమతించే ప్రయోజనాల కోసం మాత్రమే వెబ్ స్టోర్‌ను ఉపయోగించడానికి అంగీకరిస్తున్నారు. ఆఫీస్ ఆఫ్ ఫారిన్ అసెట్స్ కంట్రోల్‌కు చెందిన యునైటెడ్ స్టేట్స్ ట్రెజరీ విభాగ కార్యాలయం నిర్వహించే యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య విభాగం ఎగుమతి పాలనా నియంత్రణలు, ఆంక్షల కార్యక్రమాలతో సహా, కానీ వీటికే పరిమితం కాకుండా వర్తించే అన్ని ఎగుమతి నియంత్రణలకు కట్టుబడి ఉంటారని మీరు అంగీకరిస్తున్నారు. వెబ్ స్టోర్‌ను ఉపయోగించడం ద్వారా, మీరు US లేదా వర్తించే ఇతర ఎగుమతి చట్టాల ప్రకారం ఎగుమతులు లేదా సర్వీస్‌లను అందుకోకుండా నిషేధించబడలేదని ప్రాతినిధ్యం వహించి హామీ ఇస్తున్నారు. మీరు ప్రోడక్ట్‌ల డౌన్లోడ్, ఇన్స్టాలేషన్ మరియు/లేదా వినియోగం వంటి వాటికి సంబంధించిన అన్ని స్థానిక చట్టాలు, నియంత్రణలకు కట్టుబడి ఉంటారని అంగీకరిస్తున్నారు.
3.3 మీరు Googleతో విడిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దిష్టంగా అనుమతి ఉంటే తప్ప, వెబ్ స్టోర్‌ను Google అందించే ఇంటర్ఫేస్ ద్వారా కాకుండా వేరే ఇతర మార్గాల్లో యాక్సెస్ (లేదా యాక్సెస్ చేసే ప్రయత్నం) చేయరని అంగీకరిస్తున్నారు. మీరు వెబ్ స్టోర్‌ను ఏవైనా ఆటోమేటెడ్ మార్గాలు (స్క్రిప్ట్‌లు, క్రాలర్లు లేదా అటువంటి టెక్నాలజీల వినియోగంతో సహా) ద్వారా యాక్సెస్ (లేదా యాక్సెస్ చేసే ప్రయత్నం) చేయరని నిర్దిష్టంగా అంగీకరిస్తున్నారు, అలాగే వెబ్ స్టోర్ వెబ్సైట్లో ఉన్న ఏదైనా robots.txt ఫైల్లో పేర్కొన్న సూచనలకు కట్టుబడి ఉంటారని హామీ ఇస్తున్నారు.
3.4 మీరు వెబ్ స్టోర్ (లేదా వెబ్ స్టోర్‌కు కనెక్ట్ చేయబడిన సర్వర్లు, నెట్‌వర్క్‌లు)కు అంతరాయం లేదా ఆటంకం కలిగించే ఎలాంటి యాక్టివిటీలో ఎంగేజ్ అవ్వరని అంగీకరిస్తున్నారు. మీరు Google లేదా ఏదైనా థర్డ్-పార్టీ నిర్వహించే ఏవైనా సర్వర్లు, నెట్‌వర్క్‌లు లేదా వెబ్సైట్లకు అంతరాయం లేదా ఆటంకం కలిగించే విధంగా వెబ్ స్టోర్‌లో ఉండే ఎలాంటి ప్రోడక్ట్లను ఉపయోగించరని అంగీకరిస్తున్నారు.
3.5 మీరు Googleతో విడిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దిష్టంగా అనుమతి ఉంటే తప్ప, ఎటువంటి ప్రయోజనం కోసం అయినా వెబ్ స్టోర్‌ను పునరుత్పాదించరని, డూప్లికేట్, కాపీ చేయరని, విక్రయించరని, దానితో వ్యాపారం చేయరని లేదా రీ-సేల్ చేయరని అంగీకరిస్తున్నారు. మీరు ఆ ప్రోడక్ట్ డెవలపర్‌తో విడిగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దిష్టంగా అనుమతి ఉంటే తప్ప, ఎటువంటి ప్రయోజనం కోసం వెబ్ స్టోర్‌లోని ప్రోడక్ట్ ఏదీ పునరుత్పాదించరని, డూప్లికేట్, కాపీ చేయరని, విక్రయించరని, దానితో వ్యాపారం చేయరని లేదా దానిని రీ-సేల్ చేయరని అంగీకరిస్తున్నారు.
3.6 మీ వెబ్ స్టోర్, అలాగే ఏవైనా ప్రోడక్ట్‌ల వినియోగం, నిబంధనల ప్రకారం మీ అనివార్యకార్యాల అతిక్రమణ, అలా అతిక్రమించినందువల్ల ఏర్పడే పరిణామాలకు (Googleను నష్టపోయేలా చేసే ఏ రకమైన నష్టం లేదా హానితో సహా) పూర్తి బాధ్యత (అలాగే మీ పట్ల లేదా ఏదైనా థర్డ్ పార్టీ పట్ల Googleకు ఎలాంటి బాధ్యత ఉండదు) మీదేనని మీరు అంగీకరిస్తున్నారు.
3.7 ప్రోడక్ట్లలో వర్తించే అన్ని మేధో సంపత్తి హక్కులతో పాటు, వీటికే పరిమితం కాకుండా, వెబ్ స్టోర్, అలాగే వెబ్ స్టోర్ ద్వారా అందుబాటులో ఉండే ప్రోడక్ట్‌లకు సంబంధించి మొత్తం హక్కు, అధికారం, ప్రయోజనం Google మరియు/లేదా థర్డ్ పార్టీల స్వంతమని, మీరు అంగీకరిస్తున్నారు. పేటెంట్ చట్టం, కాపీరైట్ చట్టం, వాణిజ్య రహస్య చట్టం, వ్యాపారచిహ్నం చట్టం, అన్యాయమైన పోటీ చట్టం అలాగే ప్రపంచవ్యాప్తంగా ఏవైనా, అలాగే అన్ని ఇతర యాజమాన్య హక్కుల ప్రకారం ఉన్న ఏవైనా, అలాగే అన్ని హక్కులు "మేధో సంపత్తి హక్కులు"గా పరిగణించబడతాయి. మీరు (i) అనుమతి ఉంటే తప్ప కాపీ చేయరని, విక్రయించరని, లైసెన్స్ అందించరని, డిస్ట్రిబ్యూట్ చేయరని, బదిలీ చేయరని, సవరించరని, రూపాంతరీకరించరని, అనువదించరని, దాని నుండి ఉత్పన్న రచనలు చేయరని, డీకంపైల్ చేయరని, రివర్స్ ఇంజినీర్ చేయరని, డిస్-అసెంబుల్ చేయరని లేదా ప్రోడక్ట్‌ల నుండి సోర్స్ కోడ్‌ను ఉత్పాదించడానికి ప్రయత్నించరని, (ii) ప్రోడక్ట్లలో ఏదైనా ఫంక్షనాలిటీలో (డిజిటల్ హక్కుల నిర్వహణ లేదా ఫార్వర్డ్-లాక్ ఫంక్షనాలిటీతో సహా, వీటికే పరిమితం కాకుండా) ద్వారా అందించిన, అమలు చేసిన లేదా ఆచరణలో ఉన్న సెక్యూరిటీ లేదా కంటెంట్ వినియోగ నియమాల నుండి తప్పించుకోవడానికి లేదా వాటికి భంగం కలిగించడానికి ఎలాంటి చర్య తీసుకోరని, (iii) ఏదైనా చట్టం లేదా థర్డ్-పార్టీ హక్కులను ఉల్లంఘించేలా కంటెంట్‌ను యాక్సెస్ చేయడానికి, కాపీ చేయడానికి, బదిలీ చేయడానికి, ట్రాన్స్‌కోడ్ చేయడానికి లేదా పునఃప్రసారం చేయడానికి ప్రోడక్ట్లను ఉపయోగించరని లేదా (iv) Google లేదా ఏదైనా థర్డ్-పార్టీ కాపీరైట్ నోటీసులు, వ్యాపార చిహ్నాలు లేదా ప్రోడక్ట్లలో చేర్చిన లేదా వాటిలో ఉన్న ఇతర యాజమాన్య హక్కుల నోటీసులను తీసివేయరని, అస్పష్టం చేయరని లేదా మార్చరని, అలాగే పైన పేర్కొన్నవి చేయడానికి ఏదైనా థర్డ్-పార్టీని అనుమతించరని అంగీకరిస్తున్నారు.
3.8 వెబ్ స్టోర్‌లోని ఏదైనా లేదా అన్ని ప్రోడక్ట్లను ముందే పరీక్షించడానికి, రివ్యూ చేయడానికి, ఫ్లాగ్ చేయడానికి, ఫిల్టర్ చేయడానికి, సవరించడానికి, నిరాకరించడానికి లేదా తీసివేయడానికి Google హక్కును (కానీ తప్పనిసరిగా వహించాల్సిన బాధ్యత కాదు) కలిగి ఉంటుంది. అయితే, వెబ్ స్టోర్‌ను ఉపయోగించడం ద్వారా మీకు అసహ్యకరంగా, అశ్లీలంగా లేదా అభ్యంతరకరంగా అనిపించే ప్రోడక్ట్‌లు ఎదురుకావచ్చని, వెబ్ స్టోర్‌ను మీ స్వంత నిర్ణయంపై ఉపయోగిస్తున్నారని మీరు అంగీకరిస్తున్నారు.
3.9 వాపసులు: మీరు వెబ్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన ప్రోడక్ట్‌లు ఏవైనా వాపసు ఇవ్వడానికి కొనుగోలు (డౌన్లోడ్ కాదు) చేసినప్పటి నుండి మీకు 30 నిమిషాల వరకు సమయం ఉంటుంది, ఈ సమయంలో మీకు వర్తించే పూర్తి ఫీజు ఏదైనా పూర్తి రీఫండ్ చేయబడుతుంది. మీరు పేర్కొన్న ప్రోడక్ట్‌ను ఒక్కసారి మాత్రమే వాపసు చేయవచ్చు; మీరు అదే ప్రోడక్ట్‌ను వెనువెంటనే మళ్లీ కొనుగోలు చేస్తే, రెండవ సారి దాన్ని వాపసు చేయలేకపోవచ్చు. ప్రోడక్ట్ వాపసు ఆప్షన్ అందుబాటులో ఉన్న వద్ద, వెబ్ స్టోర్ యూజర్ ఇంటర్ఫేస్ ద్వారా మీకు అది అందుబాటులో ఉంచబడుతుంది.
3.10 రీఫండ్, బిల్లింగ్ వివాదాలు: వెబ్ స్టోర్‌లో కొనుగోళ్లకు సంబంధించి తలెత్తే బిల్లింగ్ వివాదాలకు Google బాధ్యత వహించదు. అన్ని బిల్లింగ్ సమస్యలను తగిన రీతిలో విచారణలోని డెవలపర్, పేమెంట్ ప్రాసెసర్ లేదా మీ క్రెడిట్ కార్డ్ కంపెనీకి డైరెక్ట్ చేయాలి.
3.11 రేటింగ్‌లు, రివ్యూలు, సమస్యల పరిష్కారాలను పోస్ట్ చేయడానికి సంబంధించిన పాలసీలు: రేటింగ్‌లు, రివ్యూలు యూజర్లకు సహాయకరంగా, విశ్వసనీయంగా ఉండాలి. Chrome వెబ్ స్టోర్‌లో కంటెంట్‌ను రివ్యూ చేయడం అనేది ఉపయోగకరమైన ఫీడ్‌బ్యాక్‌ను షేర్ చేయడానికి, గొప్ప కంటెంట్‌ను, సర్వీస్‌లను కనుగొనడంలో ఇతర Chrome వెబ్ స్టోర్ యూజర్లకు సహాయం చేయడానికి ఒక గొప్ప మార్గం.
రేటింగ్‌లు, రివ్యూలకు Chrome వెబ్ స్టోర్ పాలసీలు దిగువున ఉన్నాయి. అభ్యంతరకరమైన లేదా ఈ పాలసీలను ఉల్లంఘించే రివ్యూలు, కామెంట్లను ఆటోమేటెడ్, హ్యూమన్ రివ్యూలు సంయుక్తంగా తీసివేస్తాయి, వాటిని పదే పదే లేదా తీవ్రంగా ఉల్లంఘించే ఎవరైనా Chrome వెబ్ స్టోర్‌లో పోస్ట్ చేసే సామర్థ్యాన్ని కోల్పోవచ్చు. మీరు సమస్యను పరిష్కరించడానికి సవరణను సమర్పించకపోతే తొలగింపులు నిరవధికంగా జరుగుతాయి. ఆంక్షలు ఆటోమేటిక్‌గా ప్రపంచవ్యాప్తంగా వర్తింపజేస్తారు. మీ ఆంక్ష అనేది ప్రాంతీయ పరిమితికి లోబడి ఉంటే, ఆ విషయాన్ని మీకు తెలియజేస్తారు.
3.11ఎ స్పామ్, నకిలీ రివ్యూలు: మీరు రివ్యూ చేస్తున్న కంటెంట్ లేదా సర్వీస్‌లో మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ కనిపించేలా మీ రివ్యూలు ఉండాలి.
3.11.బి టాపిక్‌తో సంబంధం లేని రివ్యూలు: టాపిక్కు సంబంధించినవిగా, అలాగే మీరు రివ్యూ చేస్తున్న కంటెంట్‌కు, సర్వీస్‌కు, లేదా ఎక్స్‌పీరియన్స్‌కు సందర్భోచితంగా ఉండేలా రివ్యూలను ఉంచండి.
3.11సి అడ్వర్టయిజింగ్: రివ్యూలు ఉపయోగకరంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము, మీరు రివ్యూ చేస్తున్న కంటెంట్ లేదా సర్వీస్ కాకుండా వేరే వాటిని ప్రమోట్ చేస్తున్నట్లయితే, అవి ఉపయోగపడవు.
3.11డి ప్రయోజన వైరుధ్యం: రివ్యూలు నిజమైనవి, నిష్పాక్షికమైనవి అయినప్పుడు అవి అత్యంత విలువైనవిగా ఉంటాయి. ఆర్థిక లాభం కోసం పని చేయని వ్యక్తులు వీటిని రాయాలి.
3.11ఇ కాపీరైట్ చేసిన కంటెంట్: రివ్యూలు మీ స్వంతమై ఉండాలి, మీ వ్యక్తిగత అభిప్రాయాలను ప్రతిబింబించాలి.
3.11ఎఫ్ వ్యక్తిగతమైన, గోప్యమైన సమాచారం: రివ్యూలను, ఎక్స్పీరియన్స్లను షేర్ చేసుకోవడానికి ఉద్దేశించినవి, గోప్యమైన వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయకుండానే మీరు దేని గురించైనా ఎలా భావిస్తున్నారో వ్యక్తపరచవచ్చు.
3.11జి చట్టవిరుద్ధమైన కంటెంట్: మీ రివ్యూలు చట్టానికి, మీరు అంగీకరించిన ఏవైనా నిబంధనలకు, లేదా చట్టపరమైన ఒప్పందాలకు అనుగుణంగా ఉండాలి.
3.11హెచ్ లైంగికంగా అందరికీ తగని కంటెంట్: Chrome వెబ్ స్టోర్ విస్తృత పరిధిలో ఉండే ప్రేక్షకుల కోసం ఉద్దేశించినది, రివ్యూలు అందుకు తగినట్టుగా ఉండాలి.
3.11ఐ విద్వేషాలు పెంచే కంటెంట్: Chrome వెబ్ స్టోర్ అందరి కోసం ఉద్దేశించినది, రివ్యూలు దానిని ప్రతిబింబించాలి.
3.11జె అభ్యంతరకరమైన రివ్యూలు: Chrome వెబ్ స్టోర్ వినోదాన్ని, సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించినది, దాడి చేయడానికి, కించపరచడానికి కాదు.
4.1 కొన్ని ప్రోడక్ట్‌లు (Google లేదా థర్డ్ పార్టీల ద్వారా డెవలప్ చేయబడినవి కావచ్చు), Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లతో అనుబంధంగా ఉపయోగించబడే ఫీచర్లను కలిగి ఉండవచ్చు. తదనుగుణంగా, ఆ ప్రోడక్ట్‌లు, సర్వీస్‌లలో అటువంటి ఫీచర్ల వినియోగం అనేది https://policies.google.com/terms లింక్‌లోని Google సర్వీస్ నియమాలు, https://policies.google.com/privacy లింక్‌లోని Google గోప్యతా పాలసీ, అలాగే ఏవైనా వర్తించే Google సర్వీస్-నిర్దేశిత సేవా నిబంధనలు, గోప్యతా పాలసీకి అనుగుణంగా కూడా కట్టుబడి ఉంటుంది.
4.2 Google ద్వారా డెవలప్ చేయబడిన ప్రోడక్ట్‌ల యొక్క మీ వినియోగం ఈ వెబ్ స్టోర్ సర్వీస్ నియమాలలో (Google డెవలప్ చేసిన ప్రోడక్ట్‌లకు అదనపు ఎండ్ యూజర్ నిబంధనలు) సెక్షన్ 8 ద్వారా కట్టుబడి ఉంటాయి.
చట్టప్రకారం అనుమతి ఉన్న గరిష్ఠ పరిధి మేరకు, మీరు Google, దాని అనుబంధ సంస్థలు, సంబంధిత డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లకు మీరు ఏవైనా ప్రోడక్ట్లను డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం, లేదా ఈ నిబంధనలను ఉల్లంఘించడంతో సహా మీ వెబ్ స్టోర్ వినియోగం కారణంగా ఎదురయ్యే లేదా అధికమయ్యే ఏవైనా, మొత్తం క్లెయిమ్‌లు, చర్యలు, వ్యాజ్యాలు లేదా చట్టపరమైన లావాదేవీలు, అలాగే ఏవైనా, మొత్తం వ్యయాలు, చట్టపరమైన బాధ్యతలు, నష్టాలు, ఖర్చులు, వ్యయాలు (సమంజస న్యాయవాదుల ఫీజులతో సహా) నుండి రక్షణ కల్పిస్తారని, నష్టపరిహారం చెల్లిస్తారని, ఎటువంటి హాని కలగకుండా చూసుకుంటారని మీరు అంగీకరిస్తున్నారు.
ప్రోడక్ట్‌ల వైఫల్యం కారణంగా మరణానికి, గాయపడటానికి, లేదా తీవ్ర స్థాయిలో భౌతిక లేదా పర్యావరణ హాని సంభవించడానికి అవకాశం ఉన్న అణు కర్మాగారాలు, జీవనాధార వ్యవస్థలు, అత్యవసర కమ్యూనికేషన్లు, విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లు లేదా ఏవైనా అటువంటి ఇతర యాక్టివిటీలలో ఉపయోగించడానికి వెబ్ స్టోర్ కానీ, ఏవైనా ప్రోడక్ట్‌లు కానీ ఉద్దేశించబడలేదు.
7.1 ఈ నియమాలు మీకు, Googleకు మధ్య పూర్తి చట్టపరమైన ఒప్పందాన్ని రూపొందిస్తాయి, మీ వెబ్ స్టోర్, ప్రోడక్ట్‌ల వినియోగాన్ని పర్యవేక్షిస్తాయి, అలాగే వెబ్ స్టోర్, ప్రోడక్ట్‌లకు సంబంధించి మీకు, Googleకు మధ్య ఉండే ఏవైనా పూర్వ ఒప్పందాలను పూర్తిగా భర్తీ చేస్తాయి.
7.2 Google మాతృ సంస్థగా ఉన్న అన్ని కంపెనీల గ్రూప్‌లోని ప్రతి మెంబర్ ఈ నియమాలకు థర్డ్-పార్టీ లబ్ధిదారుగా పరిగణించబడతారు, అటువంటి ఇతర కంపెనీలు వారికి లబ్ధి కలిగించే (లేదా అనుకూల హక్కులు) ఈ నిబంధనల్లోని ఏదైనా నిబంధనను ప్రత్యక్షంగా అమలు చేసే, దానిపై ఆధారపడే హక్కును కలిగి ఉంటాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు. ఇది కాకుండా, ఏ ఇతర వ్యక్తిని లేదా కంపెనీని ఈ నియమాలకు థర్డ్-పార్టీ లబ్ధిదారులుగా పరిగణించడం జరగదు.
7.3 ఏ అధికారిక ప్రదేశంలో అయినా నిషేధాజ్ఞ నివారణోపాయాల (లేదా దానికి సమాన స్థాయిలో సత్వర చట్టపరమైన ఉపశమనం) కోసం దరఖాస్తు చేసుకోవడానికి Google అనుమతించబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.
8.1 ఏదైనా ప్రోడక్ట్ లేదా అందులోని భాగాలను ("ప్రోడక్ట్) డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా, మీరు https://policies.google.com/terms లింక్‌లోని Google సర్వీస్ నియమాలకు, అలాగే https://policies.google.com/privacy లింక్‌లోని Google గోప్యతా పాలసీకి కట్టుబడి ఉంటారని ఆమోదించి, అంగీకరిస్తున్నారు.
అదే విధంగా, ఏదైనా ప్రోడక్ట్‌ను డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం లేదా ఉపయోగించడం ద్వారా,ఈ కింది అదనపు నియమాలు, షరతులు ("నియమాలు, షరతులు")ను ఆమోదించి, అంగీకరిస్తున్నారు.
8.2 ఆ ప్రోడక్ట్‌కు సంబంధించి అటువంటి ఫీచర్ల విషయంలో మీ వినియోగం అనేది https://www.google.com/chrome/terms/ లింక్‌లోని Google Chrome, Chrome OS అదనపు సర్వీస్ నియమాలు, https://www.google.com/chrome/privacy/ లింక్‌లోని Chrome గోప్యతా ప్రకటన అలాగే ఎప్పటికప్పుడు నోటీసు లేకుండా అప్డేట్ చేయబడే Google సర్వీస్-నిర్దేశ సర్వీస్ నియమాలు, గోప్యతా పాలసీ ద్వారా కూడా కట్టుబడి ఉంటుంది. ఈ ప్రోడక్ట్‌కు సంబంధించి మీ కొనసాగుతున్న వినియోగం ఈ నియమాలు, షరతులు అలాగే పేరాలో లిస్ట్ చేయబడిన ఇతర నియమాలకు మీ ఒప్పందాన్ని కలిగి ఉంటుంది. మీరు అంగీకరించకపోతే, దయచేసి ప్రోడక్ట్‌ను ఉపయోగించడాన్ని ఆపివేయండి.
8.3 ఈ ప్రోడక్ట్, సంబంధిత అంశాలు, డాక్యుమెంటేషన్ పూర్తిగా ప్రైవేట్ నిధులతో డెవలప్ చేయబడ్డాయి. ప్రోడక్ట్ యూజర్ యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వానికి చెందిన ఏజెన్సీ, శాఖ, ఉద్యోగి లేదా ఇతర పక్షం అయితే, టెక్నికల్ డేటా లేదా మాన్యువల్స్‌తో సహా ప్రోడక్ట్ వినియోగం, డూప్లికేట్ చేయడం, రీప్రొడక్షన్, రిలీజ్, సవరణ, బహిర్గతం చేయడం లేదా బదిలీ ఈ నియమాలు, షరతులలో ఉన్న నిబంధనలు, షరతులు, ఒప్పందాల ద్వారా నియంత్రించబడుతుంది. ఫెడరల్ అక్విజిషన్ రెగ్యులేషన్ 12.212 ప్రకారం సమాఖ్య పౌర సంస్థలకు, డిఫెన్స్ ఫెడరల్ అక్విజిషన్ రెగ్యులేషన్ సప్లిమెంట్ 227.7202 ప్రకారం మిలిటరీ సంస్థలకు, ప్రోడక్ట్ వినియోగం ఈ నియమాలు, షరతులు ద్వారా మరింత నియంత్రించబడుతుంది.
8.4 ఎప్పటికప్పుడు, Google డెవలపర్ నియమాలు లేదా ఇతర చట్టపరమైన ఒప్పందాలు, చట్టాలు, నియంత్రణలు లేదా పాలసీలను ప్రోడక్ట్ ఉల్లంఘిస్తోందా లేదా అనేదాన్ని Google నిర్ణయించవచ్చు. అటువంటి సందర్భంలో, Google తన విచక్షణను అనుసరించి మీ సిస్టమ్ నుండి అటువంటి ప్రోడక్ట్లను రిమోట్‌గా డిజేబుల్ చేసే లేదా తీసివేసే హక్కుని కలిగి ఉందని మీరు అంగీకరిస్తున్నారు. ఎప్పటికప్పుడు, బగ్ పరిష్కారాలు లేదా మెరుగైన కార్యాచరణతో పాటు ప్రోడక్ట్‌లకు అందుబాటులో ఉండే అప్డేట్ల కోసం Google Chrome రిమోట్ సర్వర్లను చెక్ చేయవచ్చు. మీ బ్రౌజర్లో ఈ కార్యాచరణ ఉన్నట్లయితే, మీకు ముందస్తు నోటీసు అందించకుండానే అలాంటి అప్డేట్లు ఆటోమేటిక్‌గా రిక్వెస్ట్ చేయబడటానికి డౌన్లోడ్ చేయబడటానికి, ఇన్స్టాల్ చేయబడటానికి మీరు అంగీకరిస్తున్నారు.
8.5 దిగువ నిర్దేశించిన విధంగా మీరు కానీ లేదా Google కానీ ఉపసంహరించే వరకు ఈ నియమాలు, షరతుల వర్తింపు కొనసాగుతుంది. మీరు మీ సిస్టమ్ లేదా పరికరం నుండి పూర్తి స్థాయిలో శాశ్వతంగా ప్రోడక్ట్‌ను తొలగించడం ద్వారా ఎప్పుడైనా ఈ నియమాలు, షరతులను ఉపసంహరించవచ్చు. మీరు ఈ నియమాలు, షరతులలోని ఏదైనా నిబంధనకు లోబడి ఉండటంలో విఫలమైతే, Google లేదా ఏదైనా థర్డ్ పార్టీ నుండి ఎలాంటి నోటీసు లేకుండానే మీ హక్కులు ఆటోమేటిక్‌గా తక్షణమే ఉపసంహరించబడతాయి. అటువంటి సందర్భంలో, మీరు తప్పనిసరిగా ప్రోడక్ట్‌ను వెంటనే తొలగించాలి.
8.6 చట్టం అనుమతించిన గరిష్ఠ పరిధి మేరకు, మీరు Google, దాని అనుబంధ సంస్థలు, సంబంధిత డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లకు మీరు ప్రోడక్ట్‌ను డౌన్లోడ్ చేయడం, ఇన్స్టాల్ చేయడం, లేదా ఈ నియమాలు, షరతులను ఉల్లంఘించడంతో సహా ప్రోడక్ట్ వినియోగం కారణంగా ఎదురయ్యే లేదా అధికమయ్యే ఏవైనా, మొత్తం క్లెయిమ్‌లు, చర్యలు, వ్యాజ్యాలు లేదా చట్టపరమైన లావాదేవీలు, అలాగే ఏవైనా, మొత్తం వ్యయాలు, చట్టపరమైన బాధ్యతలు, నష్టాలు, ఖర్చులు, వ్యయాలు (సమంజస న్యాయవాదుల ఫీజులతో సహా) నుండి రక్షణ కల్పిస్తారని, నష్టపరిహారం చెల్లిస్తారని, ఎటువంటి హాని జరగకుండా చూసుకుంటారని మీరు అంగీకరిస్తున్నారు.
8.7 ప్రోడక్ట్ వైఫల్యం కారణంగా మరణానికి, గాయపడటానికి, లేదా తీవ్ర స్థాయిలో భౌతిక లేదా పర్యావరణ హాని సంభవించడానికి అవకాశం ఉన్న అణు కర్మాగారాలు, జీవనాధార వ్యవస్థలు, అత్యవసర కమ్యూనికేషన్లు, విమాన నావిగేషన్ లేదా కమ్యూనికేషన్ సిస్టమ్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్‌లు లేదా ఏవైనా ఇతర యాక్టివిటీలలో ఉపయోగించడానికి ప్రోడక్ట్ ఉద్దేశించబడలేదు.
8.8 ఈ నియమాలు, షరతులు అలాగే రెఫరెన్స్ ద్వారా చేర్చబడిన ఏవైనా ఇతర నియమాలు ప్రోడక్ట్‌కు సంబంధించి మీకు, Googleకు మధ్య పూర్తి ఒప్పందాన్ని ఏర్పరుస్తాయి, మీ ప్రోడక్ట్ వినియోగాన్ని పర్యవేక్షిస్తాయి, ప్రోడక్ట్‌కు సంబంధించి మీకు, Googleకు మధ్య ఉన్న ఏవైనా పూర్వ లేదా సమకాలీన ఒప్పందాలను పూర్తిగా భర్తీ చేస్తాయి.
8.9 ఏ అధికారిక ప్రదేశంలో అయినా నిషేధాజ్ఞ నివారణోపాయాల (లేదా దానికి సమాన స్థాయిలో సత్వర చట్టపరమైన ఉపశమనం) కోసం దరఖాస్తు చేసుకోవడానికి Google అనుమతించబడుతుందని మీరు అంగీకరిస్తున్నారు.